- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద శివారులో గల హార్టికల్చర్ సమీపంలో వేర్ హసింగ్ గోదాం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తెలిపారు. వేర్ హౌసింగ్ ఏర్పాటు చేసి 40 వేల మెట్రిక్ టన్నుల సైంటిఫిక్ గోదామును ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. 9 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కూల్ స్టోరేజ్ గోదాముగా దీనిని వినియోగించనున్నట్లు వారు తెలిపారు.
- Advertisement -