Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోర్గం గోదావరి తీరాన పుష్కర ఘాట్ కోసం స్థల పరిశీలన

బోర్గం గోదావరి తీరాన పుష్కర ఘాట్ కోసం స్థల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రాబోవు పుష్కరాలను పురస్కరించుకొని బోర్గం గ్రామ సమీపంలోనున్న గోదావరి తీరాన నూతన పుష్కర ఘాట్ నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఏఈ భూజేందర్, గ్రామస్తులు కలిసి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. పుష్కర ఘాట్ కి సబంధించిన నివేదికను పై అధికారులకు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు మేక సంతోష్, పాలకవర్గ సభ్యులు గాండ్ల మారుతి, ఖదీర్ పాషా, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చీరడి రవి,స్థానిక రైతులు సిహెచ్ నరేందర్, సిహెచ్ గోపి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -