Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణం కోసం స్థలం పరిశీలన

ఆలయ నిర్మాణం కోసం స్థలం పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం శివారులోని గాంధీనగర్ సమీపంలో ఉన్న పెద్దగుట్ట పైన నరసింహ స్వామి ఆలయ నిర్మాణం కోసం బుధవారం స్థల పరిశీలన చేశారు. స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి ఆధ్వర్యంలో సభ్యులు, గ్రామ పురోహితులు రమేష్ పంతులు పర్యవేక్షణలో నరసింహస్వామి ఆలయం కోసం స్థల పెద్దగుట్ట పైన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి నిర్మాణం లేకుండా ప్రస్తుతం పెద్దగుట్ట పైన ఉన్న నరసింహస్వామి గ్రామస్తులు తరతరాలుగా పూజలు చేస్తున్నారు. నేపథ్యంలో గుట్టపైన స్వామివారికి ఆలయం నిర్మించేందుకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంకల్పించారు. అందులో భాగంగా పెద్దగుట్ట పైన ఎక్కడ నూతనంగా గుడిని నిర్మిస్తే బాగుంటుందో పరిశీలించి ఆలయ నిర్మాణం సాధ్యసాద్యాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నూకల బుచ్చి మల్లయ్య, సున్నమోహన్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -