Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర గ్రంధాలయ నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన

కేంద్ర గ్రంధాలయ నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నిజామాబాదు జిల్లా కేంద్ర గ్రంధాలయం నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి కోరిన మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  శనివారం ఉదయం జిల్లా కేంద్ర గ్రంధాలయానికి సమీపంగా ఉన్న పాత డిఇఓ కార్యాలయం ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ అధునాతనంగా భవన నిర్మాణం చేసినట్టయితే పాఠకులకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఖాళీ స్థలంలో 40 శాతం జిల్లా కేంద్ర గ్రంధాలయం నిర్మాణానికి, 60 శాతం జిల్లా కోర్టు వారు ఉపయోగించుకునడానికి చర్యలు చేపట్టవలసిందిగా ఆర్డిఓ కి సూచించారు. అనంతం జిల్లా కేంద్ర గ్రంధాలయం సందర్శించి గ్రంథాలయంలో నిర్వహిస్తున్న పలు విభాగాలు పరిశీలించి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పాఠకుల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  నగేష్ రెడ్డి, నరాల రత్నాకర్ , శేఖర్ గౌడ్ , విపుల్ గౌడ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -