Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్కరీంనగర్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శివకృష్ణ ఏకగ్రీవం

కరీంనగర్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శివకృష్ణ ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గొట్టే శివకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ తరఫున అఫిలియేషన్ పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ రామ్, జనరల్ సెక్రటరీ ఆదిత్య, డెవలప్మెంట్ ఆఫీసర్ శేషు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ తరఫున కరీంనగర్ జిల్లాలో రగ్బీ అభివృద్ధికి అవసరమైన అన్ని సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

రగ్బీ ఆటను గ్రామీణ స్థాయిలో విస్తరించి, యువతను ప్రోత్సహించేందుకు శివకృష్ణ తగిన చర్యలు తీసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక పట్ల కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు నందెల్లి మహిపాల్ , జనార్దన్ రెడ్డి, యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో రగ్బీకి మరింత ప్రోత్సాహం లభించాలని వారు అభిలషించారు. గొట్టే శివకృష్ణకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -