ఇద్దరికి గాయాలు
2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొీన్నాయి. ముందు వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనకున్న కార్లు ఒకదానికొకటి ఢీకొీన్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఎస్ క్రాస్ కారు డ్రైవర్ హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఇది గమనించని వెనక వచ్చిన మరో 5 వాహనాలు ఒకదానికొకటి ఢకొీట్టాయి. దాంతో ఆరు కార్ల ముందు భాగం ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఔటర్ రింగ్‌రోడ్డుపై 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. మొదటి కారు వ్యక్తి సడన్ బ్రేక్ వేయడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.
హిమాయత్‌సాగర్ ఓఆర్‌ఆర్‌పై ఆరు కార్లు ఢీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES