- Advertisement -
28 మందికి భారీ జరిమానా
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి జై శిక్ష పడిందని 28 మందికి భారీ జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 12 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం 12నాడు పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ మేడం ముందర హాజరుపరచగా 08మందికి 59,000/- జరిమానా విధించామన్నారు. మిగతా 4 గురికి అరుణ్, రవి, శ్రీనివాస్ గౌడ్ లకు 3 రోజుల జైలు, వాఘమారే గజానన్ 2 రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.
- Advertisement -



