- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్ పై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మొదట డివైడర్ను ఢీకొీట్టి.. పల్టీలు కొడుతూ.. మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -