Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైద్యం వికటించి ఆరు నెలల బాలుడు మృతి

వైద్యం వికటించి ఆరు నెలల బాలుడు మృతి

- Advertisement -

రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఘటన
క్రియాన్స్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి : పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
నవతెలంగాణ-గండిపేట్‌

కాలం చెల్లిన మందులతో చికిత్స అందించడంతో వైద్యం వికటించి ఆరు నెలల బాలుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని సన్‌ సిటీ క్రియాన్స్‌ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలోని వికాస్‌నగర్‌లో నివాసం ఉంటున్న విష్ణువర్థన్‌రెడ్డి, ఆశ్విని దంపతులు.. తమ చిన్నారికి జ్వరం రావడంతో స్థానిక క్రియాన్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ బాలుడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కాలం చెల్లిన మందులు ఇచ్చారు. దాంతో కొద్దిసేపటికి బాలుడి ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -