Tuesday, March 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓ తండ్రి పోరాటానికి ఆరు ఆస్కార్‌లు

ఓ తండ్రి పోరాటానికి ఆరు ఆస్కార్‌లు

- Advertisement -

ఆస్కార్‌ ఉత్తమ చిత్రం ‘ఒన్‌ బ్యాటిల్‌ ఆప్టర్‌ అనదర్‌’
ఉత్తమ నటుడు : మైఖేల్‌ బి జోర్డాన్‌, ఉత్తమ నటి : జెస్సీ బక్లీ, ఉత్తమ దర్శకుడు : పాల్‌ థామస్‌ అండర్సన్‌

లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా 98వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆస్తకిగా ఎదురు చూసిన ఈ ఆస్కార్‌ అవార్డుల్లో ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు మరో 4 అవార్డులను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.’సిన్నర్స్‌’ చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటుడిగా మైఖేల్‌ బి జోర్డాన్‌, ‘హామ్మెట్‌’ చిత్రంలోని నటనకు గాను జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు.

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ పురసారాన్ని బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా అందజేశారు. కథలో బలం, పాత్రల మధ్య సంఘర్షణను ప్రేక్షకులు, విమర్శకులే కాదు ఆస్కార్‌ జ్యూరీ సైతం ఫిదా అవుతుందని ‘ఒన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమా నిరూపించింది. యావత్‌ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల్లో 13 విభాగాల్లో పోటీ పడిన ఈ సినిమా ఏకంగా 6 అవార్డులను గెల్చుకుని విజయకేతనాన్ని ఎగురవేసింది. తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో బిడ్డ నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం ఓ తండ్రి చేసిన పోరాటమే ఈ సినిమా.
బ్లాక్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు.

ఉత్తమ చిత్రం : ఒన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
‘ఇన్‌ మెమరియ్’ సెగ్మెంట్‌లో హాలీవుడ్‌ ప్రముఖలతోపాటు మన భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్‌కుమార్‌, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దగ్గజాలకు ఆస్కార్‌ ఘన నివాళి అర్పిస్తూ ఓ వీడియోను ఆస్కార్‌ పురస్కార ప్రదానోత్సవంలో ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -