Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంకన్ డ్రైవ్లో ఆరుగురికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్లో ఆరుగురికి జైలు శిక్ష

- Advertisement -

10 మందికి జరిమాన 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడిందని పదిమందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ ఈ నెల 28.10.2025 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందు హాజరుపరచగా 10 మందికి13,000/- విధించామన్నారు.

మిగితా 6 గు రిలో ఎల్లమ్మ గుట్టకు చెందిన బిందెల కార్తీక్,  కంత్రి వర్జిశ్వర్ అను వ్యక్తులకు ఒకరోజు,ముప్కల్ కు చెందిన  ఆకుల హరీష్ గౌడ్, సతీష్ నగర్  షేక్ యూసుఫ్ కు,అల్లే వంశీ తండ్రి నాగభూషణం అను వ్యక్తులకు రెండు రోజుల జైలుశిక్ష పడిందని, మెగావా దేవి సింగ్ అను వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష పడిందని తెలిపారు. ఈ సందర్భముగా ఏసీపీ మస్తాన్ అలీ,ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ..వాహనదారులు ఎట్టి పరిస్థిలో మద్యం సేవించి వాహనాలు నడపరాదనీ లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -