Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeమానవివర్షాకాలంలో చర్మ సంరక్షణ

వర్షాకాలంలో చర్మ సంరక్షణ

- Advertisement -

వర్షాకాలంలో మన చర్మాన్ని సంరక్షించు కోవాలి. జిడ్డు చర్మం, సున్నితమైన చర్మానికి ఒకే విధమైన సంరక్షణ అవసరం లేదు. ఎల్లప్పుడూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఫేస్‌ స్కిన్‌కే పరిమితం కాకుండా బాడీ స్కిన్‌పైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వాతావరణంలో అధిక తేమతోనూ చెమటపడుతుంటుంది. ఇది చర్మాన్ని జిడ్డుగా మార్చుతుంది. ఇది మొటిమలకు దారితీయడమే కాకుండా, చెమట వల్ల శరీర దుర్వాసనను ఎదుర్కోవడానికి ఉపయోగించే డియోడరెంట్లు వర్షాకాలంలో అలర్జీని కలిగిస్తాయి. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, తామర, దద్దుర్లు చర్మానికి హానికరం. అటువంటి పరిస్థితుల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఇక్కడకొన్ని మార్గాలు ఉన్నాయి.
సన్‌స్క్రీన్‌
వర్షాకాలం కదా అని సన్‌స్క్రీన్‌ను వాడటం మరిచిపోవద్దు. అన్ని సీజన్లలో సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. బయటికి వెళ్లడానికి 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. మీ చర్మానికి సరిపోయే సన్‌స్క్రీన్‌ని ఎంచుకోండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే దానికి తగిన సన్‌స్క్రీన్‌ ఉపయోగించండి.
ఫేస్‌ వాష్‌
రోజుకు కనీసం రెండుసార్లు తేలికపాటి ఫేస్‌ వాష్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకోండి. చర్మం జిడ్డుగా మారితే, మళ్లీ శుభ్రం చేయండి. జిడ్డు చర్మానికి తగిన ఫేస్‌ వాష్‌ని ఎంచుకోండి. చర్మం ఆరోగ్యంగా, రంధ్రాలను బిగుతుగా ఉంచడానికి సున్నితమైన టోనర్‌ని ఉపయోగించండి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad