సైకిల్‌పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి ఎదిగాం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: శంషాబాద్‌లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. తొలి ప్రయివేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని తెలిపారు. ”ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది. సైకిల్‌పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలి. స్పేస్ సెక్టార్‌లో కో ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకువచ్చాం. జన్‌జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుంది. అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్‌లు వస్తున్నాయి. ప్రయివేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జన్‌జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్స్, సైంటిస్టులు అవకాశాలు అందిపుచ్చుకోవాలి” అని మోడీ తెలిపారు.
స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -



