Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సుప్రీం ఆదేశాలతో ఎన్నికల కమిషన్ కు చెంపపెట్టు: ఎంపీ చామల

సుప్రీం ఆదేశాలతో ఎన్నికల కమిషన్ కు చెంపపెట్టు: ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
బీహార్ లోఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ఎస్ ఐ ఆర్ పేరుతో 65 లక్షల మంది ఓటర్లను తొలగించడం తప్పుబడుతూ గురువారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం భారత ఎన్నికల కమిషన్కు చెంప పెట్టని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తొలగించిన ఓట్లు వెబ్సైట్లో 48 గంటల్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండు వారాలుగా ఎన్నికల కమిషన్ అక్రమాలపై చేస్తున్న పోరాటంకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్వాగతిస్తున్నమన్నారు. పార్లమెంట్లో స్పీకర్ ఓటర్ల తొలగింపు పై చర్చకు అవకాశం ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వాన్ని  ఎన్నికల కమిషన్ కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఓట్లను ఎందుకు తొలగించారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొనడం సుప్రీంకోర్టు ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు.భారతదేశ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా ముఖ్యమైందని ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఓటు హక్కును కాపాడడానికి ముఖ్యమైన పిల్లర్గా ఎన్నికల కమిషన్ బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఇండియా కూటమి ఐక్యంగా చేసిన పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యం నేడు కాపాడబడిందన్నారు. జీవించి ఉన్న వారిని కూడా చనిపోయినట్టు ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ తయారు చేయడం సుప్రీంకోర్టు కు దృష్టికి జీవించి ఉన్న వారిని ప్రత్యక్షంగా చూపించడం వలన ఎన్నికల కమిషన్ తప్పులు బయటపడ్డాయి అన్నారు.

కర్ణాటకలో రాహుల్ గాంధీ దేశ ప్రజలందరి ముందట ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో ఎన్నికల కమిషన్ చేసిన తప్పులపై ప్రజెంటేషన్ ఇవ్వడం దేశ ప్రజలందరికీ బిజెపి మోడీ ప్రభుత్వం అక్రమంగా గద్దెనెక్కిన విషయం బట్టబయలు అయిందన్నారు.కర్ణాటక మహారాష్ట్ర హర్యానా బీహార్లలో పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడినట్లు చెప్పారు. ఒక్కరికి ఒకే ఓటు అనే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకునేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad