Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఆసియా ఫ్యాక్టరీల్లో మందగింపు

ఆసియా ఫ్యాక్టరీల్లో మందగింపు

- Advertisement -

– అమెరికా సుంకాల భయాలు
– అనిశ్చితిలో కార్యకలాపాలు
టోక్యో :
ఆసియా ఆర్థిక వ్యవస్థలలోని అనేక ఫ్యాక్టరీల కార్యకలాపాలు మందగించాయి. ఈ ఏడాది జూన్‌ నెలలో అమెరికా సుంకాల అనిశ్చితి కారణంగా డిమాండ్‌ తక్కువగా ఉండటంతో స్తబ్దతను ఎదుర్కొంటున్నాయని రాయిటర్స్‌ ఓ కథనంలో వెల్లడించింది. అయితే ఇటీవల అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలతో తయారీదారులకు స్వల్ప ఉపశమనం లభించొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఆర్థిక పునరుద్ధరణ అవకాశాలు మందగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌లో కొంత తయారీ కార్యకలాపాలు విస్తరించినప్పటికీ అమెరికా సుంకాల అనిశ్చితి కారణంగా కొత్త ఆర్డర్లు కుంచించుకుపోయాయి. దక్షిణ కొరియాలో ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. మే నెలలో చైనాలో 48.3 నుండి కొత్త ఆర్డర్లలో పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. ”మొత్తంగా జూన్‌లో తయారీ సరఫరా, డిమాండ్‌ పునరుద్ధరణ అయ్యాయి. కానీ బాహ్య పరిస్థితులు కఠినంగా, సంక్లిష్టంగా ఉన్నాయి. అనిశ్చితులు పెరుగుతున్నాయి.” అని అకైక్సిన్‌ ఇన్సైట్‌ గ్రూప్‌ ఆర్థికవేత్త వాంగ్‌ జీ పేర్కొన్నారు. భారత్‌లో తయారీ కార్యకలాపాలు 14 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రాయిటర్స్‌ పేర్కొంది. ఇది అంతర్జాతీయ అమ్మకాలలో పెరుగుదలను సూచిస్తుంది. మార్చిలో అమెరికా విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం తెలిసిందే. దీర్ఘకాలిక వాణిజ్య సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు. మే నెలలో చైనా ఎగుమతులు 34.5 శాతం తగ్గాయి. ఇది ఫిబ్రవరి 2020 తర్వాత అత్యంత క్షీణత. ఈ పరిస్థితి చైనా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. ఈ సవాళ్లు ఆసియా ఆర్థిక వ్యవస్థలకు ఎగుమతి ఆధారిత వృద్ధిని కొనసాగించడం కష్టతరం చేస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad