ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సారధ్యంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో ఆదివారం సోమాజీ గూడా ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు అజయ్ కుమార్‌తోపాటు ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు’ పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా ఆయనకు శ్రీనివాసరావు చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరిగింది. ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, మోహన్ గోటేటి, బాల్ రెడ్డి, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావుతో పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, సెక్రటరీ సురేష్‌కొండేటి కలిసి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకి ఘన సత్కారం చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ,’ప్రభుకి గద్దర్ అవార్డు రావడం యావత్ సినీ పాత్రికేయులందరూ కూడా ఆనందించ దగ్గ విషయం. ఎందుకంటే రైట్ పర్సన్‌కి ఈ అవార్డు వచ్చింది. చిన్న సినిమాకి ప్రభుత్వ పరంగా సపోర్ట్ కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అలాగే మా ఫిలిం ఛాంబర్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. గతంలో చంద్రబాబు హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమాలే పరిశ్రమకు పెద్ద దిక్కు అనేది నా నమ్మకం’ అని అన్నారు.
చిన్న నిర్మాతలే పరిశ్రమకు పెద్ద దిక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



