Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న బోతున్న పల్లె ప్రకృతి వనాలు 

చిన్న బోతున్న పల్లె ప్రకృతి వనాలు 

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ 
పల్లెల్లో ప్రజలకు ఆహ్లాదం పెంచేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పల్లెపకృతి వనాలు చిన్న బోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ లేకపోవడంతో మొక్కలు, చెట్లు ఎండిపోతున్నాయి. ఎండాకాలంలో ఆకురాలడంతో వనమంతా ఆకులతో నిండిపోతున్నాయి అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మండలంలోని పలుచోట్ల పల్లె పకృతి వనాలు కేవలం బోర్డుకి పరిమితమైనవి. ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నవి.

ఉపాధి కూలీలతో పల్లె పకృతి వనాల్లో ఉన్న చెత్త పిచ్చి మొక్కలను తొలగించొచ్చు. కానీ ఆ ప్రయత్నాలు చేయడం లేదు కనీసం నీరు పట్టే నా తుడే లేడు ఉన్నత అధికారులు స్పందించి పల్లె పకృతి వనాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాలతో పాటు నూతన మండలాలలోని కొన్ని గ్రామాలలో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రారంభంలో  ఉన్న కల తరువాత లేకుండా చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో గ్రామ వార్డు సభలలో  సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -