నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామంలో మంగళవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంటూ నివారణ టీకాల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కంపదండి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శిబిరంలో 17గోజాతి 156 గేదేజాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పకుండ ఆరు నెలలకు ఒక్కసారి గాలికుంటూ నివారణ టీకా వేయించుకోవాలని సూచించారు.జీవాలు గాలికుంటూ వ్యాధి భారిన పడటంతో నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డెక్కలలో పగుళ్ళు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్తప్తి తగ్గిపోవడము, చుడి పశువులు అబార్షన్స్ అవ్వడం వంటి లక్షణాలు ఏర్పడతాయి అన్నారు. రైతులు ముందు జాగ్రత్త కోసం తప్పకుండ గాలి కుంటూ నివారణ టీకాలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ఎల్ఎస్ఎ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర స్పరన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



