నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలకు పెద్ద బీరవల్లి మాజీ సర్పంచ్ తాళ్లూరి దుర్గమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు తాళ్లూరి దుర్గా ప్రదీప్ స్మార్ట్ టీవీ ని మంగళవారం పాఠశాలకు అందజేశారు. ఈ స్మార్ట్ టీవీ ని పెద్ద బీరవల్లి సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు, దుర్గమ్మ భర్త తాళ్లూరి కోటేశ్వరరావు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రూ..25 వేల స్మార్ట్ టీవీ బహుకరించడం అభినందనీయమన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. గతంలో అనేకమంది దాతలు ప్రాథమిక పాఠశాలకు వివిధ రూపాలలో సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
గ్రామస్తులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుందని, ఉన్నత విద్యను అభ్యసించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో నే ఉన్నారన్నారు. అనంతరం వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దపోలు రామారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి తలుపుల రాము, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. శారద, పాఠశాల ఉపాధ్యాయులు గుగులోత్ రామకృష్ణ, ఎం నరేష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పిల్లలమర్రి వెంకట అప్పారావు, మాజీ ఎంపీటీసీ కర్లకుంట దేవమణి, ఫీల్డ్ అసిస్టెంట్ రెడ్డిబోయిన గోపి లీల, అంగన్వాడి ఉపాధ్యాయురాలు స్వరూప, నాగలక్ష్మి, ఆశా వర్కర్ రమాదేవి, గ్రామ వివో రాజ్ కుమారి, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



