ఎలాంటి సంబంధమూ లేదు
అల్లుడు కోపంతో అత్తగారితో… మీ అమ్మాయి సరిగా వంట చేయడం లేదు అన్నాడు.
దానికి తెలివైన అత్తగారు… ”మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత తన పనులతో మాకేం సబంధం, ఎలాంటి బాధ్యతా లేదు” అంటూ తాపీగా బదులిచ్చింది.
పాత వస్తువులు అమ్మబడును
వెంగళప్ప చాలా కోపంగా చేతులు నలిపేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అది చూసిన బంగారప్ప.. సమస్య ఏమిటీ అని అడిగాడు. దానికి…
వెంగళప్ప: కొత్త సంవత్సరం వస్తుంది కదా. నా పాత వస్తువులు కొన్ని ఒలెక్స్‌లో అమ్మకానికి పెట్టాను. ఇప్పటి వరకు ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు, కొనలేదు.
బంగారప్ప: దేన్ని అమ్మకానికి పెట్టావేంటీ?
వెంగళప్ప: 2017 క్యాలెండర్!
చెప్తే వినాలి…
వెంగళ్రావు తన కొడుకుతో ఇలా చెబుతున్నాడు..
”తల్లితో ప్రేమగా మాట్లాడాలి..
తండ్రితో మర్యాదగా మాట్లాడాలి..
అన్నదమ్ములతో అభిమానంగా మాట్లాడాలి..
గురువులతో గౌరవంగా మాట్లాడాలి..
బామ్మర్దులతో వెటకారంగా మాట్లాడినా ఫర్వాలేదు”
అని చెప్పడం పూర్తి చేయకముందే…
కొడుకు : మరి భార్యతో ఎలా మాట్లాడాలి
తండ్రి : అంత సీన్ లేదు.. ఆవిడ ఏం చెబితే అది వినాలి.
పెళ్ళయింది
ఆది: ఏమిట్రా, ఈ మధ్య కవితలేవీ రాయడం లేదు, ఏమైందేమిటీ?
రాజేష్ : నేను ఎవరి కోసమైతే కవితలు రాశానో.. ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.
ఆది: అయితే, విరహాన్ని వ్యక్తం చేస్తూ కవితలు రాసేరు, సూపర్‌గా వస్తాయి.
రాజేష్ : నీకు అర్థం కావడం లేదు భయ్యా! ఆమె పెళ్లి నాతోనే జరిగింది!
పిల్లలు మాత్రమే…
ఒక టూరిస్ట్ ఇండియాలో పర్యటిస్తూ ఒక గ్రామం గుండా వెళ్తూ గైడ్‌ని ఇలా అడిగాడు…
టూరిస్ట్ : ఈ గ్రామంలో ఎవరైనా గొప్పవారు పుట్టారా?
గైడ్ : లేదండి. అందరూ చిన్న పిల్లలే పుట్టారు
వ్యాపార ధోరణి
బాక్సింగ్ పోటీలు చూస్తున్న సుబ్బారావు ”కొట్టు బాగా కొట్టు.. దెబ్బకి పళ్లన్నీ రాలిపోవాలి” అని కసిగా అరుస్తున్నాడు.
పక్కనే ఉన్న మరో ప్రేక్షకుడు అతన్ని చూసి ఇలా అడిగాడు..
ప్రేక్షకుడు: ఇంతకీ మీరు ఎవరికి సపోర్టు చేస్తున్నారు?
సుబ్బారావు : ఎవరికీ చేయడం లేదు..
ప్రేక్షకుడు: మరి ఎందుకు ఆ అరుపులు?
సుబ్బారావు : ఈ స్టేడియం పక్కనే నా డెంటల్ హాస్పిటల్ ఉంది. ఇద్దరిలో ఎవరికి పళ్లు రాలినా నా దగ్గరకే వస్తారని…
పెళ్ళంటే…
శిష్యుడు : గురువుగారూ… పెళ్ళంటే ఒక్క మాటలో అర్థం చెప్పండి?
గురువు : ఒక్క వాక్యంలో చెప్పడం కష్టం శిష్యా…! పెళ్ళి తర్వాతి జీవితం పానీపూరి లాంటిది! హాయిగా సాగే జీవితానికి పెళ్లనే చిల్లు పెట్టుకొని, సంసారమనే మసాలా నీళ్లేసుకుని, దాంట్లో అసూయ-ఈర్ష్యలనే కూర-ఉల్లిపాయ ముక్కలేసుకుని, హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతూ.. సగం మీదేసుకుని, బలవంతంగా నోట్లో కుక్కేసుకొని, కక్కలేక ఆ మంటను అలాగే మింగేసుకుని, నషాలానికి అంటే ఆ మంటకు కంట్లో నీళ్లెట్టేసుకుని, మన అవస్థల్ని నవ్వుతూ చూస్తున్న వాళ్ల వైపు కోపంగా ఒక లుక్కేసుకుని, కారుతున్న మూతి, ముక్కు తుడుచుకుంటూ, తిన్న ఒక్క పానీపూరీతో సరిపెట్టుకోక, మరో పానీపూరీ కోసం ఆశగా చూసే దౌరాÄ్భగ్యపు బతుకైపోతుంది నాయనా మిగిలిన జీవితం..
భలే… భలే…
విమాన ప్రయాణంలో ఇండియన్స్‌కి వైన్ ఇవ్వడం నిషేధించారు. ఎందుకంటే…
బ్రిటిషర్ – నేను పడుకుంటా!
అమెరికన్ – నేను ఇంటర్నెట్‌లో పనిచేసుకుంటా!
జర్మన్ – నేను మ్యూజిక్ వింటా!
చైనీస్ – నేను సినిమా చూస్తా!
ఇండియన్ – మామా, తప్పుకో! నేను ఫ్లైట్ నడుపుతా!