Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపరీక్షలు ప్రారంభమయ్యే వరకు 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ ఇవ్వాలి

పరీక్షలు ప్రారంభమయ్యే వరకు 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ ఇవ్వాలి

- Advertisement -

తెలంగాణ గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ అసోసియేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్‌ హెడ్మాస్టర్స్‌ అసోసియేషన్‌ కోరింది. గురువారం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ ఆ అసోసియేషన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ స్నాక్స్‌ ను 19 రోజులకు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలోనే సమస్యలన్ని పరిష్కరిస్తామని నికోలస్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ నజీముద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ చంద్రశేఖర్‌, కోశాధికారి పి.వెంకటేష్‌, చక్రారెడ్డి, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -