- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పలురోజుల నుంచి మంచు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంచు పెద్దమొత్తంలో రోడ్లలపై ఉండిపోయింది. దీంతో రాకపోకలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.





- Advertisement -



