Sunday, February 22, 2026
E-PAPER
Homeసినిమాఇంతకీ.. హీరో ఎవరు?

ఇంతకీ.. హీరో ఎవరు?

- Advertisement -

భారతీయ సినిమా లెజెండ్స్‌గా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నారు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌. వీరిద్దరూ కలిసి నటించే సినిమా కోసం వారి అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆ మోస్ట్‌ అవేటెడ్‌ సినిమాను మన ముందుకు రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ త్వరలోనే తీసుకురానుంది. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబోలో భారీ పాన్‌ -వరల్డ్‌ మూవీని నిర్మిస్తోందీ సంస్థ. ‘కెహెచ్‌-ఆర్‌కె’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ అరుదైన చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ అనౌన్స్‌ చేసింది.

డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శనివారం ఈ చిత్ర ప్రోమోని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రోమోలో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ పోటా పోటీగా సన్నద్ధమవడం ఆసక్తి కలిగిస్తోంది. ఒకరు సెలెక్ట్‌ చేసుకున్న సూట్‌ మరొకరు వద్దనడం, ఒకరు ఎంపిక చేసుకున్న షూస్‌ మరొకరు రిజెక్ట్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రోమో చివరలో హీరో ఎవరు అని డైరెక్టర్‌ను క్వశ్చన్‌ చేయడం ఫన్‌ క్రియేట్‌ చేస్తోంది. ప్రోమోకు అనిరుధ్‌ ఇచ్చిన బీజీఎం హైలైట్‌గా నిలుస్తోంది. ప్రోమోలో కమల్‌, రజనీ స్టైలిష్‌ లుక్‌లో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్‌ తెలియజేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -