Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సోషల్ ఆడిట్ బృందం ఖర్చల లెక్కల్లో తప్పులు తడక..!

సోషల్ ఆడిట్ బృందం ఖర్చల లెక్కల్లో తప్పులు తడక..!

- Advertisement -
  • – ఇదేమిటి అని నిలదీసిన కార్యదర్శులపై దురుసుగా ప్రవర్తించిన సోషల్ ఆడిట్ ఎస్టీఎం 
    నవతెలంగాణ – మల్హర్ రావు

    మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రూ.4,07,38,522 కోట్ల పనులపై ఒక ఎస్ఆర్పీ, 8 మంది డిఅర్పిలు ఈ నెల 20 నుంచి 27 వరకు మండలంలో అన్ని గ్రామాల్లో సోషల్ ఆడిట్ చేపట్టారు. గురువారం 16వ విడత సామాజిక ప్రజావేదికలో నివేదికలు ప్రవేశపెట్టారు.ఇంతవరకు బాగానే ఉన్నా 16వ సామాజిక తనిఖీ ఖర్చుల వివరాల కింద మాత్రం లెక్కల్లో తప్పుల తడక చూపించారు.మొత్తం లెక్కల్లో రూ.69,992 చూపగా, అసలు లెక్కలు మాత్రం రూ.61,784 మాత్రమే అయింది.ఈ విషయాన్ని సోషల్ ఆడిట్ రాష్ట్ర అధికారి ఎస్టీఎం అజయ్,ఎస్ఆర్పీ వెంకన్న దృష్టికి తాడిచెర్ల,మల్లారం గ్రామాలతోపాటు పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తీసుకపోయారు.ఇందుకు సమాధానం చెప్పాల్సిన ఎస్టీఎం దురుసుగా ప్రవర్తిస్తూ,అవును మా ఇష్టం,మీకు దిక్కున్న చోట చెప్పుకొండని,పత్రికల్లో ఇవ్వండి మాకు ఎం కాదని ఒక రాష్ట్రస్థాయి అధికారి ఇలా అనడం విడ్డురంగా ఉందని పలువురు ముక్కున వెలువేసుకొంటున్నారు.తనిఖీల ఖర్చులే తప్పుల తడకగా చెసిన సోషల్ ఆడిట్ బృందం వారం రోజులపాటు ఉపాధిహామీ తనిఖీల్లో చేపట్టిన ఆడిట్ లో నిజం ఎంతగా ఉందో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోనుందా..అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad