Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
ఉపాధి హామీ పనులలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సామాజిక తనిఖీ ఒక కీలక ప్రక్రియ అని డిఆర్పి బి.ప్రకాష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు బినామీ పనులు, బోగస్ మస్టర్లు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, కూలీలకు న్యాయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అన్నారు. ఉపాధి హామీ పనులు నిరంతరంగా చేపట్టాలని, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు సభ్యులు సుకన్య, లావణ్య, వెంకటేష్, ప్రవీణ్, శ్యాంప్రసాద్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -