Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం: మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమర భేరి సభ నిర్వ‌హిస్తామ‌ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్‌లో టీపీసీపీ విస్తృత స్థాయి నిర్వ‌హించారు. ఈ సంద్భరంగా ఆయ‌న మాట్లాడుతూ.. సమరభేరి సభలో గ్రామ స్థాయి అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నార‌ని తెలిపారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ సంక్షేమ పథకాల‌తో మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయ‌న దీమా వ్య‌క్తం చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమ‌ని అందుకు నిద‌ర్శనం సీఎంగా రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్య‌క్షులుగా తన నియ‌మాకం, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌లు సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు అనుగుణంగా ప‌దవులు కేటాయించామ‌ని ఆయ‌న వివ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -