Sunday, November 16, 2025
E-PAPER
Homeహెల్త్మనసును మాయం చేస్తున్న సోషల్‌ మీడియా

మనసును మాయం చేస్తున్న సోషల్‌ మీడియా

- Advertisement -

”మొదట మనం సోషల్‌ మీడియాను వాడాం… ఇప్పుడు సోషల్‌ మీడియా మనల్ని వాడుతోంది.” సోషల్‌ డైలమా – యువత భవితను కనెక్ట్‌ చేస్తుందా? లేక కట్‌ చేస్తుందా? సోషల్‌ డైలమా అంటే ”మనసు రెండు వైపులా లాగడం.” ఒక వైపు సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవాలని, కనెక్ట్‌ అవ్వాలని యువత కోరుకుంటుంది. మరో వైపు అదే ప్లాట్‌ఫాం వారి మనసును, ఆత్మస్థైర్యాన్ని, అసలైన విలువలను క్రమంగా కంగతీస్తుంది. వర్చువల్‌ ప్రపంచం నిజ జీవితాన్ని మసకబారుస్తోంది.

ఈ రోజు ప్రతి ఒక్కరూ ఒక ‘డిజిటల్‌ మనిషి’ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌నే మిర్రర్‌గా, ‘లైక్‌’లనే లైఫ్‌గా, ‘ఫాలో’లనే ఫ్యూచర్‌గా మార్చేసుకున్నారు. కానీ… ఈ కనెక్ట్‌డ్‌ లైఫ్‌ వెనుక ఒక మానసిక డైలమా దాగి ఉంది.
డోపమైన్‌ మాయ : సోషల్‌ మీడియా వాడేటప్పుడు మన మైండ్‌లో డోపమైన్‌ (Dopamine) అనే ‘హ్యాపీ హార్మోన్‌’ విడుదల అవుతుంది. ప్రతి లైక్‌, కామెంట్‌, షేర్‌ ఒక చిన్న ఆనందం ఇస్తుంది. కానీ ఆ ఆనందం తాత్కాలికం. మళ్లీ మళ్లీ ఆ అనుభూతి కావాలని మనం ఫోన్‌ చెక్‌ చేస్తుంటాం. ఇది ఒక Reward- Addiction Cycle. దీన్ని ‘Digital Dopamine Trap’ అని పిలుస్తారు. మానసికంగా ఇది ఎక్కువ కాలం కొనసాగితే.. దృష్టి, ఓపిక, ఆత్మస్థైర్యం క్షీణిస్తాయి.

మన చుట్టూ ఉన్న సైలెంట్‌ స్టోరీస్‌
ఉదాహరణ 1:
ఒక విద్యార్థి ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఫోన్‌ చెక్‌ చేస్తాడు. న్యూస్‌ కంటే ముందు నోటిఫికేషన్స్‌ చూస్తాడు. ఇది ‘డిజిటల్‌ కండిషనింగ్‌’ మనసు వాస్తవ ప్రపంచం కంటే వర్చువల్‌ రియాలిటీని ముందుగా అంగీకరిస్తోంది.
ఉదాహరణ 2:
ఒక అమ్మాయి తన ఫోటోకి లైక్‌లు తక్కువగా వచ్చినప్పుడు తన విలువ తగ్గిందనే భావనకు లోనవుతుంది. ఇది Social Comparison Trap. ఇతరులతో మనం మనల్ని పోల్చుకోవడం వల్ల వచ్చే అసంతప్తి.

ఉదాహరణ 3:
ఒక యువకుడు యూట్యూబ్‌లో ప్రతి రోజు గంటల తరబడి వీడియోలు చూస్తాడు. అతని బ్రెయిన్‌కి అది ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు ఎస్కేప్‌. ఇది వాస్తవ జీవిత బాధ్యతల నుంచి పారిపోయే మానసిక రక్షణ కవచం. ‘టెక్నాలజీ మన అవసరాల కోసం ఉండాలి. మనసు అవసరాల కోసం కాదు.’
సోషల్‌ మీడియా అధికంగా వాడకం వల్ల… Attention Deficit Lifestyle (ఓపిక తగ్గడం), Emotional Detachment (భావోద్వేగ దూరం), Selfworth Issues (స్వీయ విలువపై అనుమానం) వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

యువత భవిత లైక్‌ల మాయలో లైఫ్‌ మాయ
భవిష్యత్తులో యువత ‘ఇన్ఫర్మేషన్‌ రిచ్‌ కానీ ఎమోషనల్‌ పూర్‌’ అవుతుందేమో అన్న ఆందోళన ఉంది. మాటల కన్నా మెసేజ్‌లు, స్నేహాల కన్నా ఫాలోవర్స్‌. ఇవే కొత్త మానసిక సంబంధాలు. వర్చువల్‌ హగ్స్‌ నిజమైన ఆలింగనం కాదు. అది కేవలం ఒంటరితనానికి డిజిటల్‌ ముసుగు.
పరిష్కారం : సోషల్‌ మీడియా నుండి పారిపోవడం కాదు, దానిని సమతుల్యంగా వాడడం నేర్చుకోవాలి. ‘ఫోన్‌ కంటే ఫ్రెండ్‌ ముఖం’ చూడటం అలవాటు చేయాలి.
‘ఆన్‌లైన్‌ టైమ్‌’ కంటే ‘ఆఫ్‌లైన్‌ మైండ్‌’ విలువైనదని గుర్తుంచుకోవాలి.
రోజుకు ఒక ‘డిజిటల్‌ డిటాక్స్‌ అవర్‌’ పెట్టుకోవాలి.

‘మీరు ఫోన్‌ను వాడండి. ఫోన్‌ మీ మనసును వాడుకోనివ్వకండి.’
సోషల్‌ మీడియా ఒక అద్భుత సాధనం. కానీ అది మన జీవితాన్ని నియంత్రించే సత్తా మనం ఇస్తేనే కలుగుతుంది. యువత భవిష్యత్తు టెక్నాలజీతో కాదు, మనసు సమతుల్యంతో నిర్మించబడుతుంది.
భవిష్యత్తు యువత డిజిటల్‌ హీరోలు అవ్వాలి కానీ ఎమోషనల్‌ జీరోలు కాకూడదు. సోషల్‌ మీడియా మన చేతిలో ఉన్న సాధనం. అది మనసును కట్టేయడం కాదు, విప్పేయడం కావాలి.
మన విలువలు, మన లక్ష్యం, మన మైండ్‌ను టెక్నాలజీ కంటే మనమే నియంత్రించాలి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -