ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు ఎం.కె.వేణు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణ వ్యవస్థ అవసరమని ప్రముఖ వెబ్‌సైట్ ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు ఎం.కె.వేణు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) సంయుక్తాధ్వర్యంలో సోషల్ మీడియా-మంచి, చెడు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ సోషల్ మీడియా రాకతో అప్పటి వరకు ప్రింట్ మీడియాలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ మాఫియాకు అడ్డుకట్ట పడి ఉపశమనం లభించిందని తెలిపారు. తమలాంటి వార్తలకు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ లభించిందని తెలిపారు.
సోషల్ మీడియా రాకతో వేగం పెరిగిందనీ, వార్తలను వెంటనే మరింత వేగంగా అందజేసేందుకు అవకాశం లభించిందని చెప్పారు. వార్తల శైలిలోనూ మార్పు వచ్చిందని తెలిపారు. సోషల్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫాంగా ఉపయోగపడుతుందన్నారు. ఇంటర్నెట్ రాకతో మీడియా ప్రజాస్వామీకరణ జరిగి ఏకపక్ష ఆధిపత్యానికి తెరపడిందని వివరించారు. ప్రస్తుత యుద్ధ వార్తలను సీఎన్‌ఎన్, బీబీసీ, అల్ జజీరా కంటే వేగంగా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అందుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే అది పెద్ద ప్రమాదమని వేణు హెచ్చరించారు. ఆ ప్రమాదానికి ఆస్కారం ఇవ్వొద్దని సోషల్ మీడియా స్వీయ నియంత్రణ కోసం ఒక అసోసియేషన్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
నరేంద్రమోడీ పీఎం కాకముందు ప్రధానమంత్రుల కార్డూన్లు కనిపించేవనీ, ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. మీడియాలో ఏకఛత్రాధిపత్యం దిశగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుల పోరాటం కంటే సమాజంలో వ్యక్తులు ఒకరితో ఒకరు దానిపై చర్చిం చుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుకు సీనియర్ పాత్రికేయులు సోమశేఖర్ అధ్యక్షత వహించగా, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ, ఐజేయు మాజీ అధ్యక్షులు డి.అమర్ స్వాగతోపన్యాసం చేసారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు కె. విరాహత్ అలీ, కె.రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణ అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



