– మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు
మదురై: చిన్నారుల సామాజిక మాధ్యమాల వినియోగంపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో 16 ఏండ్లలోపు చిన్నారులు సోషల్‌మీడియా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఎస్ విజరు కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్‌లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయని, వీటిని ఎవరైనా చూసే వీలుందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్‌వేర్‌ను అభివ ృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామక ృష్ణన్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. పోర్నోగ్రఫీ కంటెంట్ చూడకుండా సాఫ్ట్‌వేర్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏండ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. అప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
16 ఏండ్లలోపు సోషల్ మీడియా బ్యాన్ పెట్టాలి
- Advertisement -
- Advertisement -



