పేదరికం తగ్గించకుంటే అంతరాలు మరింత పెరిగే ప్రమాదం : చేయూత పింఛన్ల పంపిణీపై సమీక్షలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) నొక్కి చెప్పారు. సమాజంలో పేదరికం తగ్గించ కుంటే అంతరాలు మరింత పెరిగిపోయే అవకాశముంద న్నారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చేయూత పింఛన్ల పంపిణీపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అందులో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, డైరెక్టర్ గోపి, జిల్లాల ప్రాజెక్టు ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్దిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అనర్హులు పింఛన్ తీసుకుంటే పేద వారికి అన్యాయం చేసినట్టు అవుతుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే ఉన్నతాధికారులకు ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. పేషి˜యల్ రికగ్రైజేషన్ ద్వారా అర్హులకే పెన్షన్ అందుతుందని చెప్పారు. ప్రతి నెలా వెయ్యి కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనే చేయూత, వారి ధైర్యం అని చెప్పారు. ఇప్పలడ్డు క్రెడిట్ అంతా ఐఏఎస్ దివ్యకే దక్కుతుందనీ, ప్రతి అధికారి కూడా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సూచిం చారు. పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలివ్వడం, ఇందిరా మహిళా క్యాంటీన్‌లు ఏర్పాటు చేయించడం, ప్రమాద బీమా వర్తింపజేయడం వంటి కార్యక్రమాల ద్వారా పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటున్నదని చెప్పారు. మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే 15 ఏండ్ల నుంచే మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఆర్టీసీలో 200 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగాయంటే మహిళలకు ఫ్రీ బస్సు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలను బస్సు ఓనర్లుగా చేసింది తమ ప్రభుత్వమేనన్నారు.
పింఛన్లు ఇవ్వడం సామాజిక బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES