సమ్మెతో దిగొచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : గిగ్‌వర్కర్ల ఇటీవల సమ్మె పిలుపుతో ఫుడ్ యాప్‌లతో పాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 90 రోజులు పనిచేస్తే గిగ్‌వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్రం ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో డెలివరీ బార్సు ఒక అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు పని చేస్తే ఈ ప్రయోజనాలు పొందవచ్చు. లేదా ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద 120 రోజులు పని చేయాలి. మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో గిగ్ వర్కర్లు గత నెల రెండుసార్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. 10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని ప్రధాన డిమాండ్‌గా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఫుడ్ యాప్స్ సంస్థలు స్విగ్గీ, జొమాటో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గిగ్‌వర్కర్ల కోసం కేంద్రం నూతన ముసాయిదా నిబంధనలను తీసుకొచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ముసాయిదాను డిసెంబర్ 30న ప్రభుత్వం విడుదల చేసింది. రోజువారి ఆదాయంతో సంబంధం లేకుండా సామాజిక భద్రతను కల్పిస్తుంది. ఒకవేళ ఒక గిగ్ వర్కర్ ఒకే రోజు ముగ్గురు అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే దానిని మూడు రోజులుగా పరిగణిస్తారు. నేరుగా లేక పరోక్షంగా అగ్రిగేటర్‌తో కలిసి పనిచేసే వారిని గిగ్ వర్కర్‌గా గుర్తిస్తామని కేంద్రం పేర్కొంది. కాగా.. అసంఘటిత కార్మికులకు సంబంధించిన ఇ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. కార్మికశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లను ప్రారంభించిందని తెలిపింది. ఇందులో నమోదు చేసుకున్నవారికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు.
గిగ్‌వర్కర్లకు సామాజిక భద్రత
- Advertisement -
- Advertisement -



