53 విద్యాసంస్థల్లో వంద శాతం ఫలితాలు :మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. 226 గురుకుల నుంచి మొత్తం 13,611 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 10,588 (77.79 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 12 విద్యా సంస్థల్లో 100 కు శాతం 100 శాతం ఫలితాలు సాధించారు. 235 గురుకుల విద్యాసంస్థల నుంచి 13,481 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం పరీక్షలకు హాజరైతే.. అందులో 11,894 మంది (88.22 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 41 విద్యాసంస్థలు 100 శాతం ఫలితాలు సాధించాయి. గతేడాది కంటే ఉత్తీర్ణతా శాతం పెరిగింది. మొదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 53 విద్యా సంస్థల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి.
సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థుల్లో మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కి 468 మార్కులు ఏడుగురికి, బైపీసీలో 440కు 438 మార్కులు ఐదుగురికి, ఆర్ట్స్‌లో 500లో 494 మార్కులు ఒకరికి వచ్చాయి. రెండవ సంవత్సరం ఎంపీసీలో వెయ్యి మార్కులకు 995 ఇద్దరికి, బైపీసీలో వెయ్యికి 994 మార్కులు ఒకరికి వచ్చాయి. సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల సాధించిన ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సంస్థ పరిపాలన నాణ్యతను ప్రతిబింబిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గురుకుల సొసైటీ అధికారులు, టీచర్‌లను అభినందించారు. విద్యార్థులకు మంత్రితో పాటు సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యసాచి ఘోష్, గురుకుల సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీలు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులకు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



