Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు ఆదర్శం

సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు ఆదర్శం

- Advertisement -

– ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం.
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి ఆలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులుగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు. ఇంతే కాకుండా వేలాదిమందికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ నేటి సమాజంలో ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతను కలిగి ఉండే విధంగా ఆదర్శంగా నిలిచారు.

కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు, గౌరవాధ్యక్షులు డాక్టర్ వేదప్రకాశ్, అధ్యక్షులు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, జలిగామ శ్రీకాంత్ లను సన్మానించారు. ప్రతి ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతను కలిగి ఉండి సామాజిక సమస్యల పైన విద్యార్థులలో చైతన్యం కల్పించి సమసమాజ స్థాపనకు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోని ఉపాధ్యాయుడు చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంప ప్రసాద్,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad