సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా, రోహిల్, ఆదిల్, రూపేష్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’.
గోరి బ్రదర్స్ మీడియా, బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ పతాకాలపై సిరాజ్ ఖాదరన్ గోరి నిరిమస్తున్నారు.
సురేష్ లంకలపల్లి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్‌ప్రభు, సాయి విజయేందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందరికీ షీల్డ్‌లు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘అన్నపూర్ణమ్మ అయిన డొక్కా సీతమ్మ గురించి ఇంతకు ముందు ఎవరికీ పెద్దగా తెలీదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆమె పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏ సమయంలో అయిన ఆమె వండి వార్చి, వడ్డించేదని చెబుతుంటారు. అలాంటి వ్యక్తి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రాలో మధ్యాహ్నం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం. ఇలాంటి ఆదర్శవంతమైన చిత్రాలు నేటి సమాజానికి అవసరం’ అని అన్నారు.
‘నా తొలి చిత్రమిది. అద్భుతమైన పాత్ర లభించింది. న్యాయం చేశాననే అనుకుంటున్నా’ అని డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక చెప్పారు.
వి. సముద్ర మాట్లాడుతూ, ”డొక్కా సీతమ్మ జీవిత కథ ఈ సినిమా. ఇలాంటి సినిమాలు తీసే అవకాశం కొంతమంది నిర్మాతలకే దక్కుతుంది. ఈ నిర్మాతలకు జీవిత కాలం చెప్పుకునే సినిమా అవుతుంది. ఇందులొ సీతమ్మ భర్తగా నటించడం అదష్టం’ అని తెలిపారు.
దర్శకుడు సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ, ‘మంచి సినిమా తీశానని, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెప్పగలను’ అని అన్నారు. ‘సినిమా పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశాం. త్వరలో సినిమాను విడుదల చేస్తాం. ఓ మంచి సినిమాతో వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని నిర్మాతలు అన్నారు.
ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం
- Advertisement -
- Advertisement -