Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసామాజిక-ఆర్థిక న్యాయం ఆచరణాత్మక అవసరం

సామాజిక-ఆర్థిక న్యాయం ఆచరణాత్మక అవసరం

- Advertisement -

– అసమానతలను పరిష్కరించని దేశం
ప్రజాస్వామ్యంగా ఉండలేదు : సీజేఐ బి.ఆర్‌ గవాయ్
న్యూఢిల్లీ :
సమాజంలోని అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక అసమానతలను పరిష్కరించకుండా.. ఏ దేశమూ నిజంగా ప్రగతిశీలమైనదిగా, ప్రజాస్వామ్యముగా చెప్పుకోలేదని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్‌ గవాయ్ అన్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం, సామాజిక ఐక్యత, స్థిరమైన అభివృద్ధిని సాధించటానికి సామాజిక-ఆర్థిక న్యాయం ఒక ఆచరణాత్మక అసవరమని కూడా ఆయన నొక్కి చెప్పారు. మిలన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమనేది సామాజిక నిర్మాణాలలో, అవకాశాల పంపిణీలో, ప్రజలు నివసించే పరిస్థితుల్లో వేళ్లూనుకోవాలని ఆయన చెప్పారు. ”పార్లమెంట్‌, న్యాయవ్యవస్థ మధ్య ఉద్రిక్తత, ముఖ్యంగా, రాజ్యాంగాన్ని సవరించటానికి పార్లమెంటు అధికార పరిధికి సంబంధించి ఒక ప్రాథమిక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. రాజ్యాంగ సవరణలు ఎంత దూరం వెళ్లగలవు? ఈ ఎపిసోడ్‌ తరచుగా న్యాయవ్యవస్థ, పార్లమెంటు మధ్య సంస్థాగత పోటీగా గుర్తుంచుకుంటుండగా.. సామాజిక-ఆర్థిక హక్కులను సాకారం చేసుకునే ప్రయత్నాల నేపథ్యంలో ఇది జరిగిందని గుర్తించటం చాలా ముఖ్యం” అని 1973 కేశవానంద భారతి కేసులో మైలురాయి తీర్పు నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అన్నారు.
ఒక దేశంలో సామాజిక-ఆర్థిక న్యాయం అందించటంలో రాజ్యాంగ పాత్ర : 75 సంవత్సరాల భారత రాజ్యాంగం నుంచి ప్రతిబింబాలు’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ప్రసంగించటానికి తనను ఆహ్వానించినందుకు అంతర్జాతీయ న్యాయవాదుల ఛాంబర్‌కు సీజేఐ గవాయ్ కృతజ్ఞతలు తెలిపారు. 75 ఏండ్లుగా సామాజిక-ఆర్థిక న్యాయం అందించటంలో భారత రాజ్యాంగం చేసిన ప్రయాణం గొప్ప ఆశయం, ముఖ్యమైన విజాయల కథ అని అన్నారు. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశ సామాజిక విధాన రూపకల్పనలో పేదరికాన్ని తగ్గించటం, ఉద్యోగ సృష్టిని పెంచటం, ఆహారం, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సేవలను అందించటం కూడా కీలకమని ఆయన తెలిపారు. 21వ శతాబ్దంలో పార్లమెంటు, న్యాయవ్యవస్థ.. రెండూ సామాజిక-ఆర్థిక హక్కుల పరిధిని విస్తరించాయని తాను చెప్పగలనని జస్టిస్‌ గవాయ్ అన్నారు.న

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad