Tuesday, February 10, 2026
E-PAPER
Homeక్రైమ్రైలుకింద పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

రైలుకింద పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
రైలుకింద పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఖైరాతాబాద్ రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన తరుణ్ (30)కు 2017లో ప్రసన్నతో వివాహమైంది. వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో అత్తవారింటికి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.

తరుణ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో అతడు పట్టాలపై ఉండటంతో గేట్‌మెన్ బయటకు పంపించారు.

అయితే కొద్దిసేపటి తర్వాత నాంపల్లి వైపు ఒక రైలు వెళుతుండటం చూసిన తరుణ్ పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి ఫోన్ రింగ్ అవుతుండటం చూసిన పోలీసులు, అవతలి వారికి విషయం తెలిపి వివరాలు కనుక్కున్నారు. నాంపల్లి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -