Saturday, May 24, 2025
Homeఖమ్మంఅశ్వరావుపేటలో భూసార పరీక్షలు..

అశ్వరావుపేటలో భూసార పరీక్షలు..

- Advertisement -

భూసార ఆధారిత ఎరువులు వాడకంతో అధిక దిగుబడులు – డాక్టర్ కే.నాగాంజలి
నవతెలంగాణ – అశ్వారావుపేట
: భూసార పరీక్ష ఆధారిత ఎరువులు యాజమాన్యాన్ని వివిధ పంటలో చేపట్టి రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని డాక్టర్ నాగాంజలి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది పర్యవేక్షణలో చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం దమ్మపేట మండలం ముష్టి బండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై భూసార పరీక్షకి మట్టి నమూనా సేకరణను వివరించారు. పామాయిల్ ఇతర ఉద్యాన మరియు వ్యవసాయ పంటలలో చీడపీడల మరియు తెగుళ్ల యాజమాన్య  పద్ధతుల గురించి వివరించారు.  డాక్టర్  శ్రీలత సాగు ఖర్చు తగ్గించుకోవాలని  తెలియజేశారు. ఇందులో భాగంగా  జీవ నియంత్రణ కారకాలైన ట్రైకోడెర్మా,సూడో మోనాస్ లను ఎలా ఉపయోగించాలో తెలియజేశారు.ఈ జీవ నియంత్రణ కారకాలు భూమిలో ఉన్న హానికర సూక్ష్మజీవులు ని తొలగించి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను పెంచుతాయని, ఈ విధంగా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని తద్వారా  భవిష్యత్తులో అధిక దిగుబడులను  సాధించవచ్చును డాక్టర్ పి శ్రీలత రైతులకు  సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -