- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో గురువారం గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగ మాతకు బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంగ మాత ఆలయ ఐదో వార్షికోత్సవం సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ఆడపడుచులందరూ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -