Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఊర దేవతుల పూజలు

ఘనంగా ఊర దేవతుల పూజలు

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పాటు గ్రామంలో  గ్రామ అభివృద్ధి కమిటీ, , గ్రామస్థుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. నేడు ఉదయం గ్రామదేవతలైన ముత్యాలమ్మ, పెద్ద పోచమ్మ, బంగారు పోచమ్మ గండి మైసమ్మ, కామప్ప, పోత లింగన్న, ఊరడమ్మ, గజ్జలమ్మ,, రాజులు  విగ్ర ప్రతిష్టాపనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉదయం మహిళలు హారతులు పట్టుకుని ర్యాలీగా ఊరేగింపుగా వెళ్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. సాయంత్రం ముత్యాలమ్మ, దుర్గమ్మ ప్రతిమలతో  ఉత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు కొబ్బరికాయలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -