- Advertisement -
తీరొక్క పువ్వులతో బతుకమ్మ
లయబద్ధమైన చప్పట్లతో, కోకిల రాగాలతో ఆడి పాడిన ఆడపడుచులు
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఆయా గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. కీరొక్క పువ్వుతో, చేర్చిన బతుకమ్మలతో లయబద్ధమైన చప్పట్లతో, కోకిల రాగాలతో వాడవాడలు బతుకమ్మ ఆటలతో మారుమోగాయి. అనంతరం గ్రామ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి, ఆడపడుచులు ఒకరికొకరు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకొని, పసుపు బొట్లు పంచుకున్నారు.
- Advertisement -