Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యలను పరిష్కరించండి

సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

– ఆర్టీసీ ఎండీకి ఎస్‌డబ్లూయూ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ మెసేజింగ్‌ డైరెక్టర్‌ వై.నాగిరెడ్డికి టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌, వర్కర్ల యూనియన్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని బస్సుభవన్‌లో కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. 2021 వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఫిక్షేషన్‌ చేసి మాస్టర్‌ స్కేల్‌ అమలు చేయాలనీ, టిక్కెట్‌ తీసుకునే బాధ్యత ప్రయాణికులదేనంటూ అమలు చేస్తూ సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలనే మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఐ.డి కార్డు ఇవ్వాలనీ, విద్యుత్‌ బస్సుల పథకంలో మార్పులు చేయాలనీ, పనిభారాలు తగ్గించాలి, వేధింపులు ఆపాలని, విధి నిర్వహణలో గాయపడిన వారికి ఐఓడి ఇవ్వాలనీ, రూట్‌కు సరిపడా రన్నింగ్‌ టైం ఇవ్వాలని కోరారు. అంతేగాక రిటైరైన వారీకి గ్రాట్యూటి, లీవ్‌ ఎన్‌ క్యాష్‌ మెంట్‌ డిఫరెన్స్‌ డబ్బులు ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం వలన పెరిగిన రద్దికీ అనుగునంగా బస్సులు పెంచకుండ, రిటైర్‌ అయిన వారి స్థానంలో నియామాకాలు చేపట్టకుండా ఉన్న కార్మికుల పైన విపరీతమైన పనిభారాలు పెంచుతూ కార్మికులను వేధించడం సరికాదన్నారు. నైట్‌ అవుట్‌ సర్వీసులకు రెస్ట్‌ రూం సౌకర్యం కల్పించానీ, ,ఉప్పల్‌ వర్క్‌ షాప్‌, బీబీయూ కరీంనగర్‌ తరలించే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సూచించారు. కన్సాలిడేటెడ్‌ పేమెంట్‌ పైన పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్‌, అదనపు ప్రధానకార్యదర్శులు రాజిరెడ్డి డి.గోపాల్‌, ఎస్‌.సాయిరెడ్డి.ఉపాద్యక్షులు, బి యాదయ్య ప్రచార కార్యదర్శి కె. మనోహర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -