- Advertisement -
నవతెలంగాణ –తంగళ్ళపల్లి
మండలంలోని బాలమల్లుపల్లె గ్రామపరిధిలో లో-వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావును గ్రామస్తులు కోరారు. శుక్రవారం సెస్ ఛైర్మన్ మండల శివారులోని బాలమల్లుపల్లె, రామోజీపేట గ్రామ ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -