Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిం, మైనార్టీల సమస్యలను పరిష్కరించండి

ముస్లిం, మైనార్టీల సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. జబ్బార్  
కలెక్టరేట్ ఎదుట ఆవాజ్ ధర్నా 
నవతెలంగాణ – వనపర్తి 

రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆవాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డి జబ్బార్ డిమాండ్ చేశారు. ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి జబ్బార్ మాట్లాడారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు జిల్లాలోని ముస్లిం మైనార్టీల స్థితిగతులపై సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ కుటుంబాలు కడుపేదరికంలో జీవనం కొనసాగిస్తున్నాయని గుర్తించడం జరిగిందన్నారు. కాబట్టి నిరుపేద ముస్లిం మైనార్టీలకు డబల్ బెడ్ రూమ్ లైన్లు కేటాయించాలని కోరారు. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న వారికి ప్రత్యేక పథకాలతో విద్యావంతులం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు పెబ్బేరు అమరచింత మండలాల్లో కబ్రాస్థాన్లు ఆక్రమించుకోవడం జరిగిందన్నారు.

గ్రామాలలో ఉన్న కబ్రా స్థానాలకు ఫెన్సింగ్లు లేవని వక్రీభవంలో అన్యాక్రాంతమయ్యాయి అని ప్రింబ్రిస్ స్కూల్స్ అధ్య భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు కనీస వసతులు లేవన్నారు. విద్యార్థులకు ఉప్పునీరు అందజేస్తున్నారని వాటి స్థానంలో మంచినీటిని సరఫరా చేయాలని కోరారు. జగపల్లి టెంపరేచర్ స్కూల్లో విద్యార్థులకు గజ్జి తామర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. నెలరోజుల క్రితం కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చిన పరిష్కారం చేయలేకపోయారన్నారు. పెబ్బేరులో కబ్రా స్థానం ఆక్రమణకు గురైందని కోర్టు జడ్జిమెంట్ వచ్చిందని, జిల్లా రెవెన్యూ కోర్టులో ఉందన్నారు.

ముస్లిం మైనార్టీ సోదరులకు యువకులకు లోన్స్ మంజూరు చేయాలని ముస్లిం మహిళలకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు అనేక రమ రకాల సమస్యలతో బాధపడుతున్న ముస్లిం మైనార్టీ లందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలలో 12 శాతం ముస్లింలకు అమలు చేయాలన్నారు. ఒక ఆస్తులను రక్షించాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు షూరిటీ లేకుండా రెండు లక్షలు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మౌసం ఇమామ్లకు మైనార్టీ శాఖ నుండి నెలకు పదివేల జీతాలు ఇవ్వాలని కోరారు. మైనార్టీలకు సప్ల నామాలు చేసి 12 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎం డి ఖాజా, జిల్లా ఉపాధ్యక్షులు గయాసోద్దిన్, జిల్లా నాయకులు ఖలీల్, ఎండి ఖాజా, అబ్దుల్ హుస్సేన్, భద్రోద్దీన్, ఫయాజ్, నాజియా కౌసర్, రంజాద్, చాంద్ పాషా, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -