Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్భూ సమస్యల పరిష్కారం..

భూ సమస్యల పరిష్కారం..

- Advertisement -

ఆర్డిఓ వెంకటేశ్వర్లు
మొదలైన రెవెన్యూ సదస్సులు 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
: రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓఆర్ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసిందని ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. తంగళ్ళపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు మంగళవారం నుండి మొదలయ్యాయి. మొదటి రోజు చింతల్ తానా, గండి లచ్చపేట గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ రెవెన్యూ సదస్సులను ఆర్డిఓ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ రెవెన్యూ సదస్సులు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించబడతాయన్నారు. రెవెన్యూ గ్రామ పరిధిలో ఈ సదస్సు ఉంటుందని, ఆయా గ్రామాల రైతులు భూ సమస్యల ఉన్నవారు వచ్చి దరఖాస్తు అందించవచ్చు అన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయబడుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి వాటిని పరిష్కరిస్తారన్నారు. డిజిటల్ సైన్, పట్టా పాస్ బుక్కు వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆర్ ఓ ఆర్ 2025 చట్టం ప్రకారం సమస్యలు పరిష్కారానికి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. సాదాభయనమ, లావని పట్టా తదితర వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. రైతు చనిపోతే వారసులకు విరాస చేయడం వంటి కూడా పరిష్కారం అవుతాయి అన్నారు. రైతులందరూ ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆయన వెంట తహసిల్దార్ జయంత్ కుమార్, రైతులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img