Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ప్రజావాణితో సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజావాణితో సమస్యల పరిష్కారం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 244 దరఖాస్తులు వచ్చాయి.
రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 64, డీఆర్డీఓ కు 32, ఉపాధి కల్పన అధికారికి 15, జిల్లా విద్యాధికారికి 11, ఎస్ డీసీ, జిల్లా పంచాయతీ అధికారికి ఏడు చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారికి 6, నీటి పారుదల శాఖకు 4, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 3, ఏడీ మైన్స్, జిల్లా వైద్యాధికారి కి రెండు చొప్పున, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా అటవీ శాఖ, మత్స్య శాఖ, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ ఎస్ ఎల్ ఆర్, సీపీఓ, ఈడీఎంకు ఒకటి చొప్పున వచ్చాయి. ఆయా అర్జీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad