Wednesday, January 7, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రజావాణితో సమస్యల పరిష్కారం

ప్రజావాణితో సమస్యల పరిష్కారం

- Advertisement -
  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల:
ప్రజావాణితో సమస్యల పరిష్కారం లభిస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 129 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు పంపారు.
రెవెన్యూ శాఖకు 54, జిల్లా పంచాయతీ అధికారి 18, గృహ నిర్మాణ శాఖకు 11, జిల్లా విద్యాధికారికి 9, ఉపాధి కల్పన అధికారికి 6, డీఆర్డీఓ 5, జిల్లా సంక్షేమ శాఖ 4, ఎండీ సెస్, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు మూడు చొప్పున, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, నీటి పారుదల శాఖ 2, మత్స్య శాఖ, భూగర్భ జలాల శాఖ, పరిశ్రమల శాఖ, ఎస్పీ ఆఫీసు, జిల్లా వైద్యాధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా రిజిస్టార్, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈఓ వేములవాడకు ఒకటి చొప్పున వచ్చాయి.

*వైద్య భవనాలకు స్థలాలు గుర్తించాలి

జిల్లాలోని ఆయా మండలాల్లో నూతన వైద్య భవనాల నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పశు వైద్యశాలల్లో అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణాలు మొదలు పెట్టి నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో గీజర్స్, ఇతర పరికరాలపై ఆరా తీశారు.

*ఇంచార్జి కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

జిల్లాలోని ఎస్సీ వెల్ఫేర్ విద్యా సంస్థల విద్యార్థులు చేతి రాతతో తీర్చిదిద్దిన నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయా శాఖల జిల్లా అధికారులకు అందజేశారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -