మోడీపాలనలో అప్రజాస్వామిక విధానాలు రాజ్యమేలుతున్నాయి
రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కాలయాపన తగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన సీపీఐ(ఎం) సమావేశంలో చుక్కరాములు మాట్లాడారు. ప్రపం చమంతా శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతుంటే, మన దేశంలో మాత్రం మూఢాచారాలకు పెద్దపీట వేస్తూ బీజేపీ పాలన చేస్తోందన్నారు. సమాజంలో సామాజిక అసమానతలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. సోషలిస్టు దేశాల్లో మార్క్సిజం ఆధారంగా ఆకలి, దారిద్య్రం, దోపిడీ, అణిచివేత లేకుండా వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి, తదితర రంగాల్లో మంచి పరిపాలన అందుతుందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిపోతున్నాయని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోడ్స్‌గా కుదించి కార్పొరేట్లకు, యాజమాన్యాలకు వత్తాసు పలికే విధంగా పరిపాలన సాగిస్తున్నారని ఆగహ్రం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్తాయిలో అమలు చేయడంలో ఊగిసలాడుతోందన్నారు. ఈ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి పేర పేదల భూములు బలవంతంగా గుంజుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, సాయిలు, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES