వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-నవీపేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ పోరాటాలతోనే సమస్యల ను పరిష్కరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్‌వాడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సదస్సుతో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సీపీఐ(ఎం) మద్దతు తో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే.. బీజేపీ ప్రభుత్వం దేశంలో 7 కోట్ల ఉపాధిహామీ జాబ్ కార్డులను, రాష్ట్రంలో 20 లక్షల జాబ్‌కార్డులను తొలగించిందన్నారు. తమకు అనుకూల ఓట్లను చేర్చుకొని మతాల పేరుతో విధ్వంసం సృష్టిస్తూ ప్రతికూల ఓట్లను తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరి స్తుందన్నారు. గ్రామాల్లో వీడీసీ వ్యవస్థను పెంపొం దిస్తూ మామూళ్లను తీసుకుంటూ కులవృత్తులపై ఆజమాయిసీ చేస్తున్నాయని అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలు జరగలేదని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు సైతం కాంగ్రెస్‌కు అనుకూలమైన వారికే అందుతున్నాయని విమర్శించారు. కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం.. ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నదని, రేషన్‌కార్డుపై 14 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. సీపీఐ(ఎం) స్థానిక సమస్యలపై పోరాడుతూనే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్ది వెంకట్రా ములు, పల్లపు వెంకటేష్, ఐద్వా నాయకులు సుజాత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోయేడి నర్సింహులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా గంగాధర్, వృత్తిదారుల సంఘం నాయకులు వడ్డెన్న, గ్రామపంచాయతీ నాయకులు ఆంజనేయు లు, నాయకులు గోవింద్, దేవేందర్ సింగ్, గౌతమ్, శేఖర్, మహబూబ్, సావిత్రి, రమాదేవి, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



