- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు నూతనంగా మోటర్ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి తీర్చడానికి నూతన మోటర్ బిగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటేశ్వర్, ఏఈ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, సెక్రటరీ భార్గవి, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



