Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోమారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

సోమారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

- Advertisement -

భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి 
నవతెలంగాణ -పెద్దవంగర
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల రైతు బంధు మాజీ చైర్మన్ పాకనాటి సోమారెడ్డి (72) అకాల మరణం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమారెడ్డి గుండెపోటుతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నవంగరలో ఆయన భౌతికకాయానికి ఎర్రబెల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అంతిమయాత్ర లో పాల్గొన్న దయాకర్ రావు, సోమారెడ్డి పాడె మోసి, భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సహచర మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఈదురు ఐలయ్య, రామచంద్రయ్య శర్మ, పాకనాటి సునీల్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, సోమేశ్వర రావు, కేఎస్ఎన్ రెడ్డి, సుధీర్, సంజయ్, విజయ్ పాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, శివరాత్రి సోమనర్సు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -